Monday, December 23, 2024

ప్రియుడితో పారిపోయిన ప్రియురాలు.. కోర్టులో భార్యపై భర్త యాసిడ్ దాడి

- Advertisement -
- Advertisement -

చెన్నై: ప్రియుడితో కలిసి భార్య పారిపోవడంతో భర్త ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. చోరీ కేసు విషయంలో భార్య కోర్టు హాజరవుతున్న విషయం తెలుసుకొని న్యాయస్థానం ప్రాంగణంలో ఆమెపై భర్త యాసిడ్ దాడి చేసిన సంఘటన తమిళనాడు రాష్ట్రం కొయంబత్తూరు ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. శికుమార్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవనం సాగిసతున్నారు. లారీ డ్రైవర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదే సమయంలో మరో వ్యక్తితో శివ కుమార్ భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారం రోజుల క్రితం అతడి భార్య ప్రియుడితో కలిసి పారిపోయింది. ఆమె కోసం ఎక్కడ వెతికినా ఆచూకీ కనిపించలేదు.

2016లో జరిగిన చోరీ కేసులో ఆమె నిందితురాలిగా ఉన్నారు. బెయిల్‌పై బయట ఉన్నారు. నెలకొకసారి కోర్టులో హాజరవుతారు. కోర్టుకు ఆమె వస్తున్న భర్తకు తెలియడంతో ఓ వాటర్ బాటిల్‌లో యాసిడ్ పోసుకొని కోర్టు ఆవరణంలోకి చేరుకున్నాడు. భార్య కనిపించగానే యాసిడ్ ఆమె ముఖంపై పోశాడు. తప్పించుకోవడానికి ఆమె ప్రయత్నించినప్పటికి గట్టిగా పట్టుకొని ఆమెపై ముఖంపై పోయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. అక్కడి ఉన్న పోలీసులు నిందితుడిని పట్టుకొని భార్యను ఆస్పత్రికి తరలించారు. ఆమె 80 శాతం గాయపడిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. శివ కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News