Sunday, April 13, 2025

నెల్లూరులో దారుణం.. మహిళను వివస్త్రను చేసి హత్య

- Advertisement -
- Advertisement -

నెల్లూరు: కట్నం కోసం ఓ మహిళని దారుణంగా భర్త, అత్తమామ, ఆడపడుచ దారుణంగా హింసించి హత్య చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే భర్త హరికృష్ణ తన తల్లిదండ్రులు నాగోరు, నర్సమ సోదరి నాగలక్ష్మితో కలిసి తన భార్యను కట్నం కోసం హింసించేవాడు. దీంతో బాధితురాలు ఆమె తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది.

అయితే తాజాగా ఆమెపై మరోసారి దాడి చేశారు. ఈసారి ఆమె ఫిర్యాదు చేయకుండా రంగునీళ్లు తాగించి ఊపిరి ఆడకుండా చేశారు. అనంతరం వివస్త్రను చేసి దారుణంగా కొట్టి హతమార్చారు. ఈ అమానవీయ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరు రూరల్ డిఎస్పి దీనిపై విచారణ చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News