Thursday, January 23, 2025

భర్త, అత్తమామ వేధిస్తున్నారు.. ఎమ్మెల్యే ముందు మహిళ ఆవేదన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/దమ్మపేట: దమ్మపేట మండలం, మందలపల్లి గ్రామంలోని ప్రకాష్ నగర్ కాలనీలో జరుగుతున్న శుభకార్యానికి హాజరవడానికి వెళ్తున్న ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును అదే కాలనీకి చెందిన ఓ వివాహిత ఎర్రటి ఎండలో చంటి బిడ్డను ఎత్తుకొని రోడ్డుపై నిల్చుంది. మహిళను గమనించిన ఎమ్మెల్యే కారు అపి ఎర్రటి ఎండలో చంటి బిడ్డను ఎత్తుకుని ఎందుకు నిల్చున్నావు అని మహిళను ప్రశ్నించగా కంట తడి పెట్టుకుంటూ… ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త మరియు అత్తమామ ఇంట్లో నుండి నెట్టి వేసి రోజు మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారని, మీరు ఈ కాలనీకి వస్తున్నారని తెలిసి తాను పడుతున్న ఇబ్బందిని బాధను తమతో చెప్పుకోవడానికి ఇక్కడ ఉన్నానని అనడంతో వెంటనే చలించిపోయిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అక్కడే ఉన్న ఎస్సై శ్రావణ్ కుమార్‌కి బాధిత మహిళ సమస్యను వెంటనే తెలుసుకొని చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. దీంతో మహిళ ఎమ్మెల్యేకు ధన్యవాదములు తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News