Friday, January 24, 2025

విద్యుత్ షాక్‌తో భార్యాభర్తల మృతి

- Advertisement -
- Advertisement -
  • అనాథలైన ఇద్దరు పిల్లలు

ఝరాసంగం: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి భార్యాభర్తలు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని బిడేకన్న గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు స్థానిక పోలీసులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ముక్కనగారి దేవదాస్ (34), ముక్కనగారి మరియమ్మ (32)లు భార్యాభర్తలు. వీరు మంగళవారం మధ్యాహ్నం తమ వ్యవసాయ పొలంలో చెరుకు పంటలో గడ్డి మందు కొట్టడానికి వెళ్లారు. అప్పటికే చెరుకు పంటను కాపాడుకోవడానికి వేసిన విద్యుత్ వైర్లను గమనించలేదు. దీంతో ప్రమాదవశాత్తు ఆ విద్యుత్ వైరు మరియమ్మ కాలుకు తగిలి విద్యుత్ షాక్‌కు గురై కేకలు వేయగా ఇది గమనించిన భర్త ఆమెను కాపాడే క్రమంలో ఆయనకు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. చుట్టుపక్కల రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అక్కడికి చేరుకొని మృతి చెందిన వారిని చూసి కంటతడిపెట్టారు. మృతులకు ఒక బాబు ఒక పాప ఉన్నారు. తల్లిదండ్రుల మృతితో పిల్లలు అనాథలుగా మిగిలారు. మృతుని తండ్రి ముక్కనగారి పెంటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజేందర్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News