Wednesday, January 22, 2025

మరణంలోనూ వీడని బంధం

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల/చెన్నూర్: మూడు ముళ్ళ తో ఏకమై ఏడు అడుగుల బంధమై చిలుకా గోరెంకలుగా కలిసి ఉంటున్న జంటను విధి ఆడిన వింత నాటకంలో భార్యభర్తలు మరణించడం అందరి హృదయాలను కలిచివేసింది. నిద్రలో ఉన్న ఇద్దరు పిల్లలు లేచిన తరువాత అమ్మ ఏం టిఫిన్ పెడుతుందో నాన్న భయటకి ఎక్కడి తీసుకు వెళ్ళుతాడో అని అనుకొన్న వారి పసి మనసులు ఇరుగు పొరుగు వారు వచ్చి అమ్మనాన్న చనిపోయారని నిద్రలేపగానే వారు రోదించిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరిని శోక సంద్రంలోకి నెట్టి వేసింది. వివరాల్లోకి వెలితే.. శుక్రవారం ఉదయం చెన్నూర్ పట్టణం లైన్ గడ్డ ప్రాంతానికి చెందిన బొల్లంపెల్లి శశిదేవి (36) ఇంట్టి ముందు వరండా ప్రాంతాన్ని నీటితో శుభ్రం చేసి అనంతరం కిందపడ్డ తన భర్త బనియన్ ను తీసి ఇనుప దండెంపై ఆరవేసె సమయంలో విధ్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.

భార్య అరుపు విన్న భర్త శ్రీనివాస్ (43) ఆమెను కాపేడె ప్రయత్నంలో అతనికి కరంటు షాక్ తగిలి ఇద్దరు అక్కడి కక్కడే మరణించారు. భార్య భర్తలు ఇద్దరు ఒకేసారి మరణించడంతో చెన్నూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. అందరితో కలుపుగోలుగా ఉండే దంపతులు ఒకేసారి మరణించడంతో అందర్ని కలిసివేసింది. పట్టణంలో బంగారు నగల ధుకాణం నిర్వహిస్తుండడంతో పాటు స్వర్నకారుల సంఘం అధ్యక్షుడుగా కొనసాగుతుండడంతో మరణానికి సంతాపంగా దుకాణాలు బంద్ పాటించి సంతాపం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News