Sunday, December 22, 2024

కొత్తగూడెంలో విషాదం.. గుండెపోటుతో భార్యాభర్తలు మృతి

- Advertisement -
- Advertisement -

కరోనా వైరస్ తర్వాత గుండెపోటుతో చనిపోయేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అన్ని వయసుల వారి గుండెపోటు రావడంతో ఆందోళన కలిగిస్తోంది. గుండెపోటుతో ఒకే కుటుంబంలో ఒకేసారి ఒకరిద్దరు మృతి చెందుతున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి.

తాజాగా ఇలాంటి విషాద సంఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు బాలాజీనర్‌లో చోటుచేసుకుంది. భర్త మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో భార్య మృతి చెందింది. వ్యవసాయ పొలంలో పనులు చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో సోమయ్య అనే రైతు కుప్పకూలి అక్కడికక్కడే చనిపోయాడు. భర్త మృతిని తట్టుకోలేకపోయిన సోమయ్య భార్య శంకరమ్మ రోదిస్తూ గుండెపోటుకు గురై మరణించింది. దీంతో ఒకే రోజు గుండెపోటుతో భార్య భర్తలు చనిపోవడంతో వారి కుటుంబంతోపాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News