Monday, December 23, 2024

రైలు ఢీకొని భార్యాభర్తలు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రైలు ఢీకొన్ని భార్యాభర్తలు మృతిచెందిన సంఘటన లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…ఎపిలోని ఈస్ట్‌గోదావరి జిల్లాకు చెందిన భార్యాభర్తలు లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో రైలు దిగి పట్టాలు దాటుతున్నారు. అదే సమయంలో శంకర్‌పల్లి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న రైలు ఇద్దరిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

మృతులు వెనుక వచ్చే రైలును గుర్తించక పోవడంతో రైలు ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో దంపతులిద్దరూ  అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. రైల్వే సిఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News