Saturday, December 21, 2024

నటి ఇషాను కాల్చి చంపిన దొంగలు…. భర్త అరెస్టు

- Advertisement -
- Advertisement -

రాంఛీ: నటి ఇషాను దోపిడీదారులు కాల్చి చంపిన ఘటనలో ఆమె భర్తను పోలీసులు అరెస్టు చేసిన సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఇషా తన భర్త ప్రకాశ్ కుమార్, తన మూడేళ్ల కూతురుతో కలిసి రాంచీ నుంచి కోల్‌కతాకు వెళ్తుంది. మార్గం మధ్యలో దోపిడీ దారులు గన్‌తో కాల్చడంతో ఇషా చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇషా తల్లిదండ్రులు ఆమె భర్త ప్రకాశ్ కుమార్‌పై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కూతురిని ప్రకాశ్ కుమార్ హత్య చేయించాడని పేర్కొంది. గతంలో ప్రకాశ్ కుమార్, ఆయన సోదరుడు ఇషాను వేధించడంతో పాటు చంపేస్తామని బెదిరించారని ఫిర్యాదులో తెలిపారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి భర్తను అరెస్టు చేశారు. పాయింట్ బ్లాంక్‌లో కాల్చడంతో ఆమె చనిపోయిందని శవ పరీక్ష నివేదికలో తేలింది. భార్యపై దాడి జరిగినప్పుడు భర్తకు ఎందుకు గాయాలు కాలేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భార్యపై దాడి చేస్తుండగా భర్త ఎందుకు అడ్డుకోలేకపోయాడని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రకాశ్ కుమార్ ముందస్తు ప్లాన్ ప్రకారం ఆ స్థలానికి రాగానే మూత్ర విసర్జన కోసం కారు ఆపారని, అతడు కొంచెం దూరం వెళ్లాక దోపిడీ దారులు ఇషాపై దాడి చేయడంతో పాటు తుపాకీతో కాల్చి చంపారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News