Sunday, January 12, 2025

నడిరోడ్డులో భార్యను వివస్త్రను చేసి చితకబాదిన టీచర్

- Advertisement -
- Advertisement -

Student dead over teacher beating

 

హైదరాబాద్: దంపతుల మధ్య గొడవ జరగడంతో ఓ టీచర్ తన భార్యను వివస్త్రను చేసి చితకబాదిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఫలోదీ పట్టణంలో కైలాశ్ సుథార్ అనే ఓ ప్రైవేటు టీచర్ తన భార్య, కూతురుతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. దంపతుల మధ్య గొడవ జరగడంతో భార్యను తీవ్రంగా కొట్టాడు. అడ్డుగా వచ్చిన కూతురును కూడా చితకబాదాడు. ఇద్దరిని వివస్త్రను చేసి నడ్డి రోడ్డు అర్ధ నగ్నంగా నిలబెట్టాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి కైలాశ్‌ను అరెస్టు చేశారు. భార్య ఫిర్యాదు చేస్తే అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. తన భార్య మతిస్థిమితం లేకపోవడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగిందని కైలాశ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News