Monday, December 23, 2024

ప్రేమ… పెళ్లి చేసుకున్న నెల రోజుల తరువాత భార్యపై భర్త కత్తితో దాడి

- Advertisement -
- Advertisement -

Husband attack on wife with knife in Love marriage

అమరావతి: ప్రేమించాడు… పెళ్లి చేసుకున్న నెల రోజుల తరువాత భార్యపై భర్త కత్తితో దాడి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా దర్శి మండలం పోతవరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పావని, సాయికుమార్ గత మూడేళ్ల నుంచి ప్రేమించుకున్నారు. గత నెల 18న ప్రేమ వివాహం చేసుకున్నారు. భర్త వేధిస్తుండడంతో తన పుట్టింటికి వెళ్లిపోయింది. కోపంతో ఊగిపోయిన సాయికుమార్ పావనిపై కత్తితో దాడి చేశాడు. ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతోనే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News