Wednesday, January 22, 2025

అమీన్‌పూర్‌లో కత్తిపోట్ల కలకలం..

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి : అమీన్‌పూర్ పీఎస్ పరిధిలోని వాణినగర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. శ్రీనివాస్ అనే వ్యక్తి బైక్ వెళ్తున్న ముగ్గురి పై కత్తితో దాడి చేశాడు. పోలిసులు తెలిపిన వివరాల ప్రకారం గత కొంత కాలంగా భార్య భర్త మధ్య వివాదం నడుస్తుందని దాంతో భార్య సునిత భర్త శ్రీనివాస్‌కు దూరంగా పుట్టింటి దగ్గర ఉంటుందని, పెద్దల సమక్షంలో పలుసార్లు పంచాయతీలు కూడా అయ్యాయని తెలిపారు.భార్యపై కక్ష పెంచుకున్న శ్రీనివాస్ అక్క సుజాత,  కుమారుడు సాయితో కలిసి డ్యూటికి వెళ్తున్న సునితపై కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన కుమారుడు సాయిని కూడా కత్తిపోట్లతో దాడి చేశాడు. ముగ్గురికి తీవ్రగాయాలు అవడంతో అక్కడ ఉన్న స్థానికులు వారిని మియాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారని. చికిత్స పొందుతూ సుజాత మృతి చెందగా సునిత పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపినట్లు వివరించారు. శ్రీనివాస్ పరారీలో ఉన్నాడని, నిందితుడు పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలిసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News