Sunday, January 19, 2025

భార్యను గొడ్డలితో నరికి చంపి, కుమారుడిని సంపులో పడేసి…

- Advertisement -
- Advertisement -

భార్య, మూణ్నెళ్ల కుమారుడిని చంపిన భర్త

అబ్దుల్లాపూర్ మెట్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్ పూర్ గ్రామంలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తే, భార్య, మూణ్నెళ్ల కుమారుడిని దారుణంగా హత్య చేశాడు. భార్య లావణ్యను గొడ్డలితో నరికి చంపాడు. కుమారుడిని సంపులో వేసి హత్య చేశాడు. నిందితుడిని ఏర్పుల ధన్ రాజ్ గా గుర్తించారు. కుటుంబ కలహాలతోనే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News