Sunday, January 19, 2025

భార్యపై అనుమానం.. కొడవలితో దాడి

- Advertisement -
- Advertisement -

నవాబ్‌పేట: భార్యపై అనుమానంవల్ల కొడవలితో దాడి చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కోట్‌పల్లి మండలం బీరెల్లి గ్రామానికి చెందిన చాకలి గోపాల్ నాగమణి దంపతులు నవాబ్‌పేట మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి వద్ద

తొమ్మిది ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చూసుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. భార్య నాగమణి పై అనుమానం పెంచుకున్న గోపాల్ కొడవలితో ఆమె పై దాడి చేశాడని, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ నాగమణి పరిస్థితి విషమంగా ఉందని, ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News