Monday, December 23, 2024

భార్యపై భర్త హత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

గాంధారి : గాంధారి మండలం నేరల్ తాండాకు చెందిన దరవాత్ రాంసింగ్‌ను హత్యాయత్నం కేసులో రిమాండ్‌కు తరలించినట్లు సదాశివనగర్ సీఐ రామన్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. గాందారి మండలం నేరల్ తాండాకు చెందిన దరావత్ రాంసాంగ్ కు పిస్కిల్‌గుట్టకు చెందిన మమత తో 2 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త మద్యానికి బానిపై ప్రతి రోజు భార్యను కొట్టేడని, అనుమానంతో భార్యను హత్య చేయడానికి కత్తితో వెంటబడగా గ్రామస్థులు అడ్డుకున్నారు.

అతనిని అడ్డుకుంటున్న క్రమంలో రవీందర్ అనే వ్యక్తికి గాయం అయినట్లు ఎప్పటికైనా తన భర్త తనను చంపుతాడని భార్య మమత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్సై డి.సుధాకర్ కేసు నమోదు చేసుకున్నారు. దార్యాప్తు లో భాగంగా సీఐ రామన్ కేసు సంభందించిన పూర్తి వివరాలు సేకరించి నేరస్తుడైన దరావత్ రాంసింగ్ వద్ద హత్యాయత్నానికి ఉపయోగంచిన కత్తి ని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News