Thursday, January 23, 2025

భర్తను చంపి ప్రియుడి ఇంట్లో పాతిపెట్టి…. నాలుగేళ్ల తరువాత

- Advertisement -
- Advertisement -

లక్నో: భర్తను భార్య చంపి ప్రియుడి ఇంట్లో మృతదేహాన్ని పూడ్చి పెట్టిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ జిల్లాలో జరిగింది. నాలుగు సంవత్సరాల తరువాత నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నంది గ్రామ్ గ్రామంలో చంద్ర వీర్, సవితా అనే దంపతులు నివసిస్తున్నారు. పక్కింట్లో ఉంటే అరుణ్ అనే వ్యక్తితో సవితా వివాహేతర సంబంధం పెట్టుకుంది. 2018లో తన భర్తను ప్రియుడితో కలిసి చంపేసింది. అనంతరం మృతదేహాన్ని ప్రియుడి ఇంట్లో గుంత తీసి పాతిపెట్టింది.

అనంతరం తన భర్త కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తన భర్తని అతడి తమ్ముడు చంద్రవీర్ చంపి ఉంటాడని అనుమానం వ్యక్తం చేసింది. నాలుగు ఏళ్ల తరువాత ఎస్ పి దిక్షా శర్మ ఈ కేసును సీరియస్ గా తీసుకొని విచారణ చేయాలని కింద సిబ్బందికి తెలిపింది. విచారణలో భాగంగా అరుణ్, సవితా అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో విచారించగా అసలు నిజాలు ఒప్పుకున్నారు. మృతదేహం పాతి పెట్టిన స్థలంలో తవ్వగా అస్థి పంజరం బయటపడింది. అస్థి పంజరాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ఇద్దరిని రిమాండ్ కు తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News