Sunday, December 22, 2024

భార్యకు గుడి కట్టించిన భర్త

- Advertisement -
- Advertisement -

వరంగల్ లో భార్యకు గుడి కట్టించాడో భర్త. తనలో సగభాగమైన భార్య మృతి చెందడంతో భర్త ఆమెకు గుర్తుగా గుడి కట్టాడు. భార్య విగ్రహాన్ని తయారు చేయించి తన పొలంలోనే ప్రతిష్ఠించాడు. కష్టసుఖాల్లో తోడున్న భార్య సుజాత మృతి చెందడంతో భర్త ఆమె ప్రేమను వదులుకోలేక గౌరవంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి భర్త వెంకటనారాయణ గుడి కట్టాడు. వరంగల్ జిల్లా బుధరావుపేటకు చెందిన వెంకటనారాయణ భార్య సుజాత ఏడాది క్రితం మృతిచెందింది. 33 సంవత్సరాల క్రితం అగ్నిసాక్షిగా తోడుంటానని వివాహ సమయంలో చెప్పిన భార్య దూరం కావడంతో ఆమె లేని లోటును

లేకుండా విడదానికి వెంకటనారాయణ వ్యవసాయ భూమి వద్ద గుడి కట్టి సుజాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యుల సమక్షంలో సుజాత విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. వెంకటనారాయణ దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. కుటుంబం సంబంధాలు దూరమైతున్న ప్రస్తుత తరుణంలో సుజాత భర్త సైడు తల్లి సైడు బంధువులతో ఆప్యాయంగా వెంకటనారాయణ చెప్పారు. కుటుంబ బంధాలను సాధించడంతోపాటు తనకు కష్టసుఖాల్లో తోడున్న భార్య సుజాత కుటుంబానికి దూరం కావద్దని తన రూపం ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండడానికి విగ్రహాన్ని ఏర్పాటు చేశానని వెంకటనారాయణ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News