Sunday, December 22, 2024

ప్రియురాలితో భర్త..రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

- Advertisement -
- Advertisement -

వివాహేతర సంబంధం నగరంలోని అంబర్‌పేటలో రచ్చకెక్కింది. ప్రియురాలితో భర్త ఎంజాయ్ చేస్తుండగా భార్య, పిల్లలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో అక్కడ పెద్ద గొడవ జరిగింది. ప్రవీణ్ భార్య, పిల్లలు అతని ప్రేయసిని బయటకు లాక్కొచ్చేందుకు ప్రయత్నించగా.. ప్రవీణ్ వారిపై దాడి చేశాడు. దీంతో వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముషీరాబాద్ ఎస్‌ఆర్టీ కాలనీ చెందిన ప్రవీణ్‌కు కొన్నేళ్ల క్రితమే పెళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, ప్రవీణ్ పని చేసే చోట ఓ మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఆ మహిళ అంబర్‌పేట్ డీడీ కాలనీలో నివాసం ఉంటుంది. ఆ మహిళకు ఇదివరకే వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

అయితే, ప్రవీణ్ ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్య, పిల్లలను పట్టించుకోవడంలేదు. దీంతో భర్త రహస్యాన్ని ఎలాగైనా బయటపెట్టాని నిర్ణయించుకున్న భార్య, పిల్లలు శనివారం డిడి కాలనీలో ప్రవీణ్, అతని ప్రేయసి ఏకాంతంగా ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ‘నా భర్తతో ఎలా ఉంటావు’ అంటూ ప్రవీణ్ ప్రేయసికి దేహశుద్ధి చేశారు అతడి భార్య, పిల్లలు. దీంతో ప్రియురాలిని రక్షించి.. భార్యను, పిల్లలను తీవ్రంగా కొట్టాడు ప్రవీణ్. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రవీణ్ కొన్ని నెలల నుంచి అంబర్‌పేటలోని డిడి కాలనీలో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ప్రవీణ్ భార్య ఆవేదన వ్యక్తం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News