Sunday, January 19, 2025

ప్రేమపెళ్లి… భార్యను ముక్కలు ముక్కలుగా నరికి డ్రమ్ములో పడేసి…

- Advertisement -
- Advertisement -

 

 

రాయ్‌పూర్: ప్రేమ పెళ్లి చేసుకున్న దంపతులు మధ్య మనస్పర్థలు ఏర్పడడంతో పాటు నకిలీ కరెన్సీ తయారు విషయంలో భర్తను భార్య మందలించినందుకు ఆమె గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి… ప్లాస్టిక్ బ్యాగ్‌లో కట్టి నీటి డ్రమ్ములో పడేసిన సంఘటన చత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్‌పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పది సంవత్సరాల క్రితం పవన్ సింగ్, సాథి సాహు అనే యువతి యువకుడు ప్రేమ పెళ్లి చేసుకొని బిలాస్‌పూర్‌లో నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యపై అనుమానం రావడంతో ఆమెతో అతడు పలుమార్లు గొడవపడ్డాడు. పవన్ సింగ్ నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న విషయం తెలియడంతో అతడిని ఆమె ప్రశ్నించింది. ఇద్దరు మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో ఇద్దరి పిల్లలను అమ్మమ్మ వాళ్ల ఇంటికి పంపించారు. జనవరి 6న భార్యను గొంతు నులిమి చంపేశాడు.

కట్టర్ సహాయంలో భార్యను ముక్కలు ముక్కలుగా నరికి వాటర్ ట్యాంక్‌లో పడేశాడు. ట్యాక్ నుంచి వాసన రాకుండా టేప్‌తో చుట్టాడు. నకిలీ నోట్ల తయారి వ్యవహారం బయటకు రావడంతో పోలీసులు పవన్ సింగ్ ఇంటికి వచ్చారు. ఇంట్లో ఉన్న నకిలీ నోట్ల తయారి మిషన్‌తో పాటు నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. డ్రమ్ము వద్దకు రాగానే దుర్వాసన రావడంతో తెరిచి చూశారు. డ్రమ్ములో శరీర భాగాలు కనిపించడంతో వెంటనే పవన్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News