Thursday, January 23, 2025

లవ్ మ్యారేజ్…. పుట్టింటికి వెళ్లిన భార్య రాకపోవడంతో…

- Advertisement -
- Advertisement -

Woman commits suicide due to financial problems

 

హైదరాబాద్: ప్రేమ వివాహం చేసుకున్న ఆరు నెలల తరువాత పుట్టింటికి వెళ్లిన భార్య తన ఇంటికి రాకపోవడంతో భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సంతోష్ కుమార్(30), ఓ యువతిని ప్రేమించి.. ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. దంపతులు ఆనంద్‌బాగ్‌లోని కృపానంద్ ఆపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. దంపతుల మధ్య గొడవలు జరగడంతో భార్య పుట్టింటికి వెళ్లింది. పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాకపోవడంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. సిఐ జగదీశ్వర్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News