Monday, December 23, 2024

భగ్నప్రేమికుడు…. భార్య మృతి… మనోవేదనతో భర్త ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Husband dead over wife death in Kamareddy

కామారెడ్డి: ప్రేమ వివాహం చేసుకున్నాడు…. భార్య చనిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె సమాధి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కొండాపూర్ గ్రామానికి చెందిన పుట్ట సురేష్ అనే యువకుడు, అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఇద్దరు ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి నాలుగు సంవత్సరాల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఒ పాప పుట్టిన తరువాత పెళ్లైన రెండు సంవత్సరాలకే యువతి చనిపోయింది. అప్పటి నుంచి మనోవేదనతో సురేష్ కుమిలిపోతున్నాడు. తల్లిదండ్రులు బలవంతంగా అతడికి రెండో పెళ్లి చేశారు. రెండో పెళ్లి చేసుకున్న తరువాత కూడా అతడు ఎప్పుడు మొదటి భార్యను గుర్తు చేసుకునేవాడు. రెండో భార్య కూడా పాప పుట్టింది. ఎప్పుడు ఆమె సమాధి వద్ద వెళ్లి రోదిస్తూ ఉండేవాడు. ఈ నెల రెండో తేదీన సమాధి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. అక్కడ ఉన్న వారు గుర్తించి వెంటనే అతడి కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News