Monday, December 23, 2024

భార్య తిట్టిందని మనస్తాపానికి గురై భర్త ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ :  భార్య మందలించడంతో మనస్తాపానికి గురై భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలంలో ఇడులూరు గ్రామానికి చెందిన పోలగోని రమేష్ (46) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 2న మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్తను భార్య సురమ్మ మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన రమేష్ గ్రామ శివారులోని తన వ్యవసాయ పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బయటకు వెళ్లిన వ్యక్తి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు రాత్రి సమయంలో ఖంగారు చెందారు. మంగళవారం ఉదయం బావి వద్దకు రైతులు లక్ష్మయ్య, శంకర్ వెళ్ళి చూడగా రమేష్ మృతదేహాం కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. రమేష్ కు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. తండ్రి మృతిపై ఎలాంటి అనుమానం లేదని కుమారుడు శివ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News