Monday, December 23, 2024

ప్రేమపెళ్లి…. అశ్లీల వీడియోలు చూపిస్తూ, సిగరెట్ తో కాల్చుతూ

- Advertisement -
- Advertisement -

Mass rape of a Minor girl in Chhatrinaka

బెంగళూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్న తరువాత భార్యకు అశ్లీల వీడియోలు చూపించడంతో పాటు సిగరెటుతో వాతలు పెడుతూ హింసలు పెడుతున్న భర్తను పోలీసులు అరెస్టు చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం మల్లేశ్వరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఐదు సంవత్సరాల క్రితం ప్రదీప్ ఓ యువతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక నుంచి సంతానం వద్దని ఆమెకు ఐదు సార్లు గర్భస్రావం చేయించాడు. గత కొన్ని నెలల నుంచి ఆమెకు అశ్లీల వీడియోలు చూపిస్తూ చిత్ర హింసలకు గురిచేశాడు. అతడి వేధింపులు తట్టుకోలేక ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడికి వెళ్లి కూడా ఆమెను వేధించడంతో భర్తపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో భార్య ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News