Sunday, December 22, 2024

భార్య ముందే చెరువులో మునిగి భర్త మృతి

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: భార్య ముందే భర్త చెరువులో మునిగి మృతి చెందిన సంఘటన మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బాచుపల్లి మండల కేంద్రంలో హన్మంత్, కల్పన అనే దంపతులు నివాసం ఉంటున్నారు. దంపతులు బైరుని చెరువుకు వెళ్లారు. శనివారం సాయంత్రం భార్య చెరువు ఒడ్డున కూర్చోగా భర్త హన్మంత్ చెరువులోకి దిగారు. కొంచెం లోతుకు వెళ్లిన తరువాత మునిగాడు, ఎంతకు బయటకు రాకపోవడంతో స్థానికులకు భార్య సమాచారం ఇచ్చింది. పోలీసులు అక్కడికి చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంలో మృతదేహాన్ని బయటకు తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News