Monday, December 23, 2024

పెళ్లైన ఆరు నెలలకే ప్రియురాలుతో పారిపోయిన భర్త

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: వివాహం జరిగిన ఆరు సంవత్సరాలకే ఓ వ్యక్తి తన ప్రియురాలుతో కలిసి పారిపోయిన సంఘటన నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురం గ్రామంలో జరిగింది. దీంతో నవ వధువు అతడి ఇంటి ముందు మహిళా సంఘాలతో కలిసి ధర్నా చేస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జూన్‌ నెలలో ఖైతాపురం గ్రామానికి చెందిన యువతిని మహేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. మహేష్ మరో యువతితో ప్రేమాయణం నడిపిస్తున్నాడు. నెల రోజుల క్రితం ప్రియురాలుతో కలిసి మహేష్ బైక్‌పై పారిపోతుండగా కిందపడిపోయారు. ఇద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి నుంచి ప్రియురాలును ఆమె కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. జనవరి 10న ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెకప్ చేసుకుంటానని ఇంట్లో చెప్పి హైదరాబాద్‌కు వెళ్లాడు. ఎంతకు తిరిగి రాకపోవడంతో వాకబు చేయగా ప్రియురాలు కూడా లేకపోవడంతో అతడి భార్య స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి మహేష్ పట్టుకుంటామని తెలిపారు. కానీ ఇప్పటి వరకు అతడిని పట్టుకోకపోవడంతో స్థానిక మహిళా సంఘాలతో భార్య అతడి ఇంటి ముందు ధర్నా చేస్తోంది. ఎస్‌ఐ మానస ఆ గ్రామానికి  చేరుకొని అతడిని పట్టుకుంటామని హామీ ఇచ్చిన కూడా ఆమె అక్కడి నుంచి కదలలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News