Monday, December 23, 2024

వేధింపులతో కోడలు ఆత్మహత్య… అమెరికాకు పారిపోయిన అత్తింటి వారు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: అత్తింటి వేధింపులు తాళలేక కోడలు ఆత్మహత్య చేసుకోవడంతో అత్తమామ, భర్త అమెరికాకు పారిపోయిన సంఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలోని పాకబండలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పాకబండకు చెందిన జెమిని అనే యువకుడితో లావణ్యకు గత సంవత్సరం పెళ్లి జరిగింది. వివాహం జరిగినప్పటి నుంచి లావణ్యకు పిల్లలు పుట్టకపోవడంతో ఆమెను వేధింపులకు గురి చేశారు. అత్తమామ, భర్త వేధించడంతో పాటు విషపు మాత్రలు మింగించారు. వెంటనే ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో అత్తింటివారిపై ఫిర్యాదు చేశారు.

సిఐ స్వామి లావణ్య మాటలను పట్టించుకోకుండా తిరిగి పంపించాడు. నవంబర్ 27న ఆమె అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోవడంతో భర్త, అత్తమామ వీసా తీసుకొని ఆమెరికాకు పారిపోయారు. సిఐ నిర్లక్ష్యం కారణంగానే తన కూతురు చనిపోయిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. సిఐ స్వామిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లావణ్య మృతిపై దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎసిపి హరి కృష్ణ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News