Thursday, January 9, 2025

భార్య పుట్టింటి నుంచి రావడంలేదని భర్త మర్మాంగాన్ని కోసుకొని

- Advertisement -
- Advertisement -

పాట్నా: బిహార్ రాష్ట్రం మాధేపూరా ప్రాంతంలో పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రావడం లేదని భర్త తన మర్మాంగాన్ని కోసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రజ్నీనాయనగర్‌లో కృష్ణ(25), అనిత అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. జీవనోపాధి నిమిత్తం కృష్ణ పంజాబ్‌లోని మండిలో ఉంటున్నాడు. తల్లిదండ్రులను చూసేందుకు అతడు సొంతూరు వెళ్లాడు. పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగిరాకపోవడంతో మనస్థాపం చెందాడు. భార్య తన ఇంటికి రాదేమోనని బాధ ఎక్కువ కావడంతో వెంటనే కత్తి తీసుకొని మర్మాంగాన్ని కోసుకున్నాడు. రక్తపు మడుగులో ఉన్న అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News