Monday, December 23, 2024

బెడిసికొట్టిన ఆత్మహత్య డ్రామా.. భార్య కళ్లముందే భర్త మృతి

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: భార్యను బెదిరించాలనుకుని చేసిన ఎత్తుగడ ఎదురుతన్నింది. మెడకు తాడు చుట్టుకుని ఉరి వేసుకుంటున్నట్లు నటిస్టూ భార్యను బెదిరించాలనుకున్నాడు ఆ భర్త. అయితే అదే అతనిపాలిట యమపాశమై ప్రాణాలు తీసింది. ఈ విషాద సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. 28 ఏళ్ల అమిత్ డూబేకు ఏడాది క్రితం శ్వేతతో వివాహమైంది. మద్యానికి బానిసైన అమిత్ మంగళవారం రాత్రి ఇంటికి తాగివచ్చాడు. దీంతో భార్య శ్వేత గొడవపడింది. ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది.

గదిలోకి వెళ్లి లోపల నుంచి గడియపెట్టుకున్న అమిత్ సీలింగ్ ఫ్యానుకు తాడుకట్టి దాన్ని మెడకు చుట్టుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నానని భార్యను బెదిరించాలనుకున్నాడు. అయితే పొరపాటున కాలికింద ఉన్న స్టూలు పడిపోవడంతో మెడకు ఉరిబిగుసుకుంది. కిటికీలోనుంచి ఈ దృశ్యాన్ని చూసి భయపడిపోయిన శ్వేత ఇరుగుపొరుగువారిని పిలిచింది. తలుపులు పగలగొట్టి అమిత్‌ను బయటకు తెచ్చిన స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అమిత్ మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News