Thursday, January 23, 2025

భార్యను చంపాడని భర్త జైళ్లో… 6 నెలల తరువాత కనిపించడంతో

- Advertisement -
- Advertisement -

Life Sentenced to 2 men for Raping Minor

పాట్నా: భార్యను చంపేశాడని ఆరు నెలలు భర్తను జైళ్లో పెట్టిన తరువాత ఆమె కనిపించిన సంఘటన బిహార్ రాష్ట్రం సీతామఢీ జిల్లా చోరౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నేపాల్‌కు చెందిన హీరాదేవీ సంవత్సరం క్రితం పరిగావన్ గ్రామానికి చెందిన శిశి కుమార్‌ను పెళ్లి చేసుకుంది. జనవరి చివర వారంలో ఆమె కనిపించకపోవడంతో తన అల్లుడే హత్య చేశాడని అత్తమామలు అతడిపై కేసు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆరు నెలల తరువాత ఆమె పుట్టింట్లో కనిపించడంతో పోలీసులు అవాక్కయ్యారు. వెంటనే భర్తను విడుదల చేశారు. ఆమె మతిస్థిమితం లేకపోవడంతో తప్పిపోయిందని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News