Monday, January 20, 2025

భర్త వేధింపులు భరించలేక హత్య చేసిన భార్య

- Advertisement -
- Advertisement -

చెన్నూర్ ః నిత్యం తాగుడుకు బానిసై భర్త వేధింపులకు భరించలేక రోకలి బండతో మోది చంపిన సంఘటన చెన్నూర్ లో వెలుగు చూసింది.స్థానిక సిఐ వాసుదేవరావు తెలిపిన వివరాల ప్రకారం ..ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన మడక తిరుపతి చెన్నూర్ గ్రామానికి చెందిన సౌందర్యతో 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం అత్తగారి ఇంటివద్ద కొత్తగూడెం కాలనీలో ఉంటు స్థానిక బట్టల షాపులో సేల్స్ మేన్ పనిచేస్తున్నాడు.తిరుపతి నిత్యం మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడుతుండేవాడని, రోజు లాగే శనివారం రాత్రి తాగి వచ్చి గొడవపడంతో భార్య సౌందర్య అతని అత్త తోడె లక్ష్మి రోకలి బండతో తిరుపతిని కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.అనంతరం తిరుపతి మృతదేహాన్ని ఎర్రగుంటపల్లి గ్రామానికి తీసుకువచ్చి వెల్లిపోయారు. మృతుని అన్న మడక సమ్మయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొ ధర్యాప్తు చేస్తున్నట్లు సి.ఐ. వాసువేవరావు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News