Tuesday, January 7, 2025

భర్తను చంపడానికి రూ.5 లక్షల సుపారీ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నాలుగు రోజుల క్రితం దేవరకొండ పట్టణ శివారులో హత్య కు గురైన రఘురాములు కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసులో భార్యకు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వివరాలలోకి వెళితే.. దేవరకొండలో రఘురాములు స్టాంప్ వెండర్ గా పనిచేస్తూ బట్టల షాప్ ప్రారంభించాడు. షాప్ నిర్వహణ బాధ్యత భార్య చూసుకునేది. రఘురాములు జల్సాలకు అలవాటు పడి కుటుంబాన్ని పట్టించుకొకపోవడంతో విసుగు చెందిన భార్య అతన్ని అంతమొందించాలనుకొని హైదరాబాదులో ఉంటున్న తన స్నేహితురాలి భర్త అరుణ్ సాయం కోరింది. అరుణ్ వద్ద తన భర్తకు రూ.50 వేలు అప్పుగా ఇప్పించింది. ఆ తర్వాత భర్తను చంపేందుకు అతనితో రూ.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది. మూడు నెలల క్రితం భర్త తాగే మద్యంలో మత్తు మందు కలిపి ఇవ్వగా అది కాస్తా విఫలమైంది.

కాగా జూన్ 26 అరుణ్ తన స్నేహితులతో దేవరకొండ చేరుకున్నారు. అరుణ్ తన దగ్గర తీసుకున్న రూ.50 వేలు కావాలని రఘురాములుకు ఫోన్ చేశాడు. దీంతో రఘురాములు అరుణ్ ని కలిశాడు. తర్వాత తన స్కూటీపై వస్తుండగా ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో ఒకరినొకరు కిందపడేసి కొట్టుకున్నారు. ముందుంగా పథకం ప్రకారం అరుణ్ వెంట తెచ్చుకున్న సైనేడును అరుణ్ రఘురాములు నోట్లో పోశాడు. దీంతో రఘురాములు ఘటన స్థలంలోనే మృతి చెందాడు. కాగా రాత్రి 10 గంటల సమయంలో అరుణ్ శ్రీలక్ష్మికి ఫోన్ చేసి నీ భర్తను చంపానని చెప్పినట్లు నిందితురాలు పోలీసుల ముందు ఒప్పుకుంది. దీంతో పోలీసులు శ్రీలక్ష్మి ని,అరుణ్, అరుణ్ స్నేహితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News