Sunday, April 6, 2025

ఖమ్మంలో కండక్టర్‌ను చంపిన భర్త

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న భార్యను భర్త కొట్టి చంపిన సంఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దేవమణి అనే మహిళ ఖమ్మం డిపోలో కండక్టర్‌గా పని చేస్తుంది. దేవమణి తన భర్త, కుమారుడు, కూతురుతో కలిసి జీవనం సాగిస్తోంది. దంపతుల మధ్య గొడవ జరగడంతో భార్యను భర్త హత్య చేశాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో నిందితుడు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News