Thursday, December 26, 2024

ఫోన్ మాట్లాడుతుందని కాబోయే భార్య గొంతు కోసి…

- Advertisement -
- Advertisement -

ఔరంగాబాద్: కాబోయే భార్య మరో వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతుందనే అనుమానంతో ఆమె గొంతుకోసి హత్య చేయడంతో భర్తను పోలీసులు అరెస్టు చేసిన సంఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. పాల్ఘర్ జిల్లాలోని వాసాయి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతికి, యువకుడి పెళ్లి సంబంధం కుదరడంతో మార్చి నెలలో పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయం తీసుకున్నాయి. పెళ్లి పనులు నిమిత్తం యువతి కుటుంబ సభ్యులు ధుసార్‌బాద్‌లోని మార్కెట్‌కు వెళ్లారు. యువతి తన ఇంట్లో ఒంటరిగా ఉండడంతో కాబోయే భర్త ఆమె ఇంటికి వచ్చాడు. ఆమెకు అతడు ఒక స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు.

అతడు పలుమార్లు ఫోన్ చేసినప్పుడు ఆమె ఫోన్ బిజీగా ఉండడంతో అనుమానం వ్యక్తం చేశాడు. ఎవరికి ఫోన్ చేస్తున్నావని ప్రశ్నించాడు. ఆమె తాను ఎవరికి ఫోన్ చేయడంలేదని తన స్నేహితులతో మాట్లాడుతున్నానని ఆమె చెప్పింది. అతడు ఆమె ఫోన్ ఆడియో కాల్ రికార్డింగ్ చెక్ చేయడంతో ఎవరితో మాట్లాడినట్టు గుర్తించడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. శనివారం గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో వంటింట్లో నుంచి చాకు తీసుకొచ్చి ఆమె గొంతు కోసి పారిపోయాడు. స్థానికులు, తల్లిదండ్రుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం నిందితుడిని అరెస్టు చేశామని సబ్ ఇన్స్‌పెక్టర్ భగత్ కాడమ్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News