Tuesday, April 1, 2025

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

- Advertisement -
- Advertisement -

భార్యపై అనుమానంతో భర్త హత్య చేసిన సంఘటన ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…ఆసిఫ్ నగర్‌లో ఉంటున్న మహ్మద్ హసన్, అస్మాబేగం భార్యభర్తలు. హసన్ తన భార్య అస్మా బేగంపై అనుమానం పెంచుకుని నిత్యం వేధించేవాడు. వేరే వారితో వివాహేతర సంబంధం పెట్టుకుందని గొడవ పెట్టుకునేవారు. ఈక్రమంలోనే అస్మాబేగంను కత్తితో పొడిచి హత్యచేశాడు. తర్వాత మృతదేహాన్ని తీసుకుని ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లాడు.

అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని మృతదేహం గురించి అడగడంతో చెత్తడబ్బాలో దొరికిందని చెప్పాడు. అనుమానం వచ్చిన సెక్యూరిటీ గార్డులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. పోలీసుల విచారణలో తాను భార్యను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడిని ఆసిఫ్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News