Wednesday, January 22, 2025

ఓల్డ్‌బోయిన్‌పల్లిలో భార్యను చంపిన భర్త

- Advertisement -
- Advertisement -

కంటోన్మెంట్ : కట్టుకున్న భార్యను కెబుల్ వైరుతో గొంతుకి బిగించి హత్య చేసిన ఘటన బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బోయిన్‌పల్లి ఇన్‌స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం…. ఓల్డ్‌బోయిన్‌పల్లి ఫ్రెండ్స్‌కాలనీలో నివాసముంటున్న కుమ్మరి లక్ష్మణ్ (50), కుమ్మరిబీనా (49)ను 94లో ప్రేమంచి పెళ్లి చేసుకున్నాడు. దంపతులు సంతానం కలగకపోవటంతో దత్తత తీసుకోవాలని ఆలోచనలో ఉన్నారు. పిల్లల విషయంతో గత కొంతకాలంగా ఇద్దరి మధ్యన గొడవలు జరుగుతున్నాయి.

కాగా బీనాతో తరచు గొడవల జరుగుతుండటంతో పలుమార్లు ఇంటి ఓనర్లతో బీనా గొడవలు పెట్టుకునేదని ఈక్రమంలో వారు తరచు ఇళ్లను మార్చేవారు. గత 9 నెలలుగా ఓల్డ్‌బోయిన్‌పల్లి ఫ్రెండ్స్ కాలనీలో నివాసముంటున్నారు. మంగళవారం సైతం ఇద్దరు గొడవ పడటంతో కోపోద్రిక్తుడైన లక్ష్మణ్ ఇంట్లో ఉన్న కెబుల్ వైరుతో బీనా గొంతుకు బిగంచి హత్యకు పాల్పడ్డాడు. స్థానికులు సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితున్ని ఆదుపులోకి తీసుకొని మృతదేహంను పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ అసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News