Monday, December 23, 2024

గర్భంతో ఉన్న భార్యను చంపి.. అడవిలో పాతిపెట్టాడు

- Advertisement -
- Advertisement -

 

బెంగళూరు: ఆరు నెలల గర్భంతో ఉన్న భార్యను భర్త అనుమానంతో హత్య చేసిన సంఘటన కర్నాటక రాష్ట్ర బళ్లారిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దావణగెరె జిల్లాలో మోహన్ కుమార్(24), రేష్మా(20) రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పెళ్లైనప్పటి నుంచి భార్యను భర్త అనుమానంతో హింసించేవాడు. కట్నం కానుకలు తీసుకరావాలని ఆమె శారీరకంగా హింసకు గురి చేశాడు. రేష్మా ఆరు నెలల గర్భిణీగా ఉంది. అనుమానంతో ఆమెను చంపేసి అనంతరం శవాన్ని అడవిలో పాతిపెట్టాడు. తన భార్య కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అత్తమామలు అల్లుడిపై అనుమానం వ్యక్తం చేయడంతో అతడిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News