Monday, December 23, 2024

ఇద్దరు భార్యలు… రెండో భార్యను పాముతో కాటు వేయించి

- Advertisement -
- Advertisement -

భోపాల్: మొదటి భార్యతో కలిసి జీవించాలనుకున్నభర్త రెండో భార్యకు పాముతో కాటు వేయించి అనంతరం ఆమెను చంపాలని ప్రయత్నం చేసిన సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మల్యా ఖేడీ గ్రామంలో మోజిమ్ అజ్మేరీ, షాను బీ అనే దంపతులు నివసిస్తున్నారు. స్మగ్లింగ్ కేసులో మోజిమ్ అజ్మేరీ జైలు పాలు కావడంతో షాను బీ తన ప్రియుడితో కలిసి పారిపోయింది. జైలు నుంచి విడుదలైన తరువాత మోజిమ్ 2015లో హలీమా బీని పెళ్లి చేసుకున్నాడు. మోజిమ్‌కు మొదటి భార్య కలిసింది. మొదటి భార్యతో కలిసి జీవనం సాగిస్తానని చెప్పడంతో రెండో భార్య వ్యతిరేకించింది. దీంతో రెండో భార్యను చంపాలని నిర్ణయం తీసుకున్నాడు.

మోజిమ్‌కు స్నేహితుడు స్నేక్ క్యాచర్ రమేష్. రెండు భార్య ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెకు తన స్నేహితుడితో కలిసి పాముతో కాటు వేయించాడు. పాము కాటు వేయగానే స్పృహతప్పి పడిపోయింది. వెంటనే మళ్లీ ఆమె స్పృహాలోకి రావడంతో ఆమెపై మళ్లీ పాము విసిరారు. పాము ఎంత కాటు వేసి ఆమె చనిపోకపోవడంతో తన సోదరుడితో కలిసి మోజిమ్ ఆమెకు విషపూరిత ఇంజక్షన్ ఇచ్చారు. వెంటనే అక్కడి నుంచి నిందితులు పారిపోయారు. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి మోజిమ్, సోదరుడు, స్నేహితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News