Friday, January 24, 2025

భార్యను ముక్కలు ముక్కలుగా నరికి… పాతిపెట్టాడు

- Advertisement -
- Advertisement -

 

కోల్‌కతా: ఓ వ్యక్తి తన భార్యను చంపి ముక్కలు ముక్కలుగా నరికి భూమిలో పాతిపెట్టిన సంఘటన కోల్‌కతాలోని మెహ్రౌలీ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బిష్ణుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శారద గార్డెన్‌లో అలీమ్ షేక్, ముంతాజ్ షేక్ అనే భార్యభర్తలు నివసిస్తున్నారు. మంగళవారం సాయంత్రం తన భార్య పని చేస్తున్న స్థలం నుంచి ఆమెను తన బైక్‌పై తీసుకొని వస్తుండగా మార్గంమధ్యలో ఆమె షాపింగ్ చేసింది. కానీ అప్పటి నుంచి ముంతాజ్ కనిపించకపోవడంతో ఎక్కడ ఉందని అలీమ్ షేక్‌ను ప్రశ్నించారు. అలీమ్ షేక్‌ను ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఎక్కడ ఉందని అడిగిన కూడా సమాధానం చెప్పకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు భర్తను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. వెంటనే ఘటనా న్థలానికి తీసుకెళ్లారు. భార్యను ముక్కలు ముక్కులుగా నరికి నిర్మానుష్య ప్రదేశంలో పాతిపెట్టాడు. పోలీసులు మృతదేహంలోని భాగాలను శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్యను భర్త చంపి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News