Sunday, December 22, 2024

భార్య అందంగా ఉందని  ఆ రాక్షసుడు ఎంతకు తెగించాడంటే…!

- Advertisement -
- Advertisement -

అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అబ్బాయిలు ఆరాటపడటం సహజం. కానీ భార్య అందంగా ఉందని అసూయపడిన భర్త గురించి విన్నారా? అంతేకాదు, ఆ అసూయతోనే భార్యను చంపేసి, పోలీసులకు దొరికిపోయాడు ఒక ప్రబుద్ధుడు.

ఉత్తరప్రదేశ్ లోని లలిత్ పూర్ సమీపంలోని చాంద్ మారి గ్రామానికి చెందిన నీరజ్ కుష్వా (27) కు రెండేళ్ల క్రితం మనీషా (22) తో  పెళ్లయింది. వారికి ఏడాది వయసున్న కుమార్తె ఉంది. చాంద్ మారి గ్రామంలో నీరజ్ టెంట్ షాపు నడుపుతూ ఉంటాడు. మనీషా అందంగా ఉండటమే కాకుండా, రీల్స్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఆమెకు చాలామంది ఫాలోవర్లుకూడా ఉన్నారు. నీరజ్ ఇది సహించలేకపోయాడు. భార్యకు విడాకులు ఇచ్చి, ఆమె చెల్లెల్ని పెళ్లి చేసుకుందామనుకున్నాడు. ఈ విషయం పసిగట్టిన మనిషా భర్తతో తరచూ గొడవ పడేది.

సోమవారం అర్థరాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. నీరజ్ కోపం పట్టలేక భార్య మనీషాను, కూతుర్ని కూడా క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపేశాడు. ఆ తర్వాత ఇల్లంతా చిందర వందర చేసి, ఇంట్లోని బంగారు నగలను దాచి పెట్టి, పోలీసులకు కబురు పెట్టాడు. తన ఇంటిపై ఆరుగురు దుండగులు దాడిచేసి తన భార్యను, కూతుర్నిచంపేసి, ఇల్లంతా దోచుకుని పోయారని కట్టుకథ వినిపించాడు. దొంగలు తననూ కొట్టారంటూ ఒంటికి తాను స్వయంగా చేసుకున్న గాయాలను చూపించాడు.

ఇంటి చుట్టుపక్కల సిసి టీవీలను వడపోసిన పోలీసులకు నీరజ్ ఇంటిపై దొంగలు దాడి చేసినట్లు ఆధారాలేవీ దొరకలేదు. తమదైన శైలిలో నీరజ్ ను విచారించగా అసలు విషయం బయటపెట్టాడు. తన భార్య రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తనకు నచ్చలేదనీ, ఆమె చెల్లెల్ని వివాహం చేసుకునే ఉద్దేశంతో భార్యనూ, కూతుర్ని చంపేశాననీ ఒప్పుకున్నాడు. పోలీసులు ఇల్లంతా గాలించి, నీరజ్ టీవీ వెనుక దాచి పెట్టిన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పోలీసులు నీరజ్ ను కటకటాల వెనక్కి నెట్టారు.

https://publish.twitter.com/?url=https://twitter.com/SachinGuptaUP/status/1744234149383147567#

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News