Tuesday, January 21, 2025

నవదంపతులు… భార్యను గొడ్డలితో నరికి… భర్త ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హనుమకొండ: పెళ్లి జరిగిన రెండు నెలలకే అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి అనంతరం భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన పుష్పలీల(21)ను హనుమకొండకు చెందిన హరీష్ రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి జరిగిన మరుసటి రోజు నుంచి భార్యను వేధించేవాడు. భార్యకు పెళ్లి కాక ముందే అక్రమ సంబంధాలు ఉన్నాయని వేధించేవాడు. వేధింపుల గురించి ఆమె తన తల్లిదండ్రులకు చెప్పడంతో అతడు ఆత్మహత్యాయత్నం చేశాడు. పెద్ద మనుషుల సమక్షంలో ఇద్దరు కలిసి ఉండాలని హరీష్‌ను మందలించారు. సోమవారం ఎవరు లేని సమయంలో మద్యం తాగొచ్చి భార్యతో గొడవకు దిగాడు. రాత్రి ఆమె గాఢనిద్రలోకి జారుకున్న తరువాత ఆమెపై గొడ్డలితో దాడిచేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తరువాత అతడు పురుగుల మందు తాగి చనిపోయాడు. పక్కింటి వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పుష్ఫలీల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News