Monday, December 23, 2024

అన్నం పెట్టలేదని భార్యను చంపిన భర్త

- Advertisement -
- Advertisement -

జైపూర్: భార్య అన్నం పెట్టలేదని ఆమెను భర్త చంపిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 15 సంవత్సరాల క్రితం రమేష్ బెనివాల్(35) అనే వ్యక్తి సుమన్‌ను పెళ్లి చేసుకున్నాడు. సుమన్ కొన్ని పెట్రోల్ బంక్‌లో పని చేసి అనంతరం మహిళా మోర్చా రాష్ట్రయ లోక్‌తంత్రిక్ పార్టీలో అధ్యక్షురాలిగా పని చేసింది. రమేష్ వడంగ్రి పని చేసేవాడు. రమేష్ శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చి భార్యను అన్నం పెట్టమని అడిగాడు. ఆమె పెట్టకపోవడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో రాయితో కొట్టడంతో ఘటనా స్థలంలోనే ఆమె చనిపోయింది. అనంతరం తన బావకు ఫోన్ చేసి తన భార్యను చంపానని చెప్పాడు. వెంటనే అతడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని డోర్ తట్టారు. భార్య మృతదేహం పక్కన భర్త కూర్చున్నాడు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Also Read: ఇండియా-పాక్ మ్యాచ్ కోసం ఆస్పత్రి బెడ్స్: అహ్మదాబాద్‌లో అడ్వాన్స్ బుకింగ్స్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News