Monday, December 23, 2024

మద్యం… భర్తను చంపిన భార్య

- Advertisement -
- Advertisement -


అమరావతి: మద్యానికి బానిసగా మారిన భర్త వేధింపులను తట్టుకోలేక అతడిని భార్య హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఏడో వార్డులోని శ్రీరామ్‌నగర్‌లో అంజి, అంకాలమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి భర్త అంజి మద్యం తాగి భార్యను వేధించేవాడు. రోజు రోజుకు భర్త వేధింపులు ఎక్కువగా కావడంతో తట్టుకోలేని స్థితిలోకి వచ్చేసింది. ఆదివారం అర్ధరాత్రి పూటుగా మద్యం తాగి వచ్చిన భర్త భార్యను వేధిస్తున్నాడు. అతడి వేధింపులు తట్టుకోలేక రొకలిబండతో తలపై మోదింది. అనంతరం అతడిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన అనంతరం నేరుగా వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది. సిఐ ఫిరోజ్, ఎస్‌ఐ బ్రహ్మనాయుడు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలు అడిగి తెలుసుకుంటున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News