Friday, November 15, 2024

అనుమానం… భార్యను గొడ్డలితో నరికి….

- Advertisement -
- Advertisement -

Husband killed wife in Bhupalapally

జయశంకర్ భూపాలపల్లి: వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో భార్యను భర్త గొడ్డలితో నరికి చంపిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి సమీపంలోగల దూదేకులపల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓల్లాల సమ్మయ్య(30), శ్రీలత(27) అనే దంపతులు దూదేకులపల్లి గ్రామంలో నివసిస్తున్నారు. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని పలుమార్లు ఆమెను అనుమానించాడు. అనుమానం పెరగడంతో శ్రీలతను హత్య చేయాలని సమ్మయ్య నిర్ణయం తీసుకున్నాడు. ఆదివారం రాత్రి గాఢ నిద్రలో ఉన్న శ్రీలత మెడపై గొడ్డలితో నరికాడు. ఆమె ఘటనా స్థలంలో మృతి చెందింది. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News