Saturday, January 11, 2025

సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేసిందని… భార్య గొంతు నులిమి…

- Advertisement -
- Advertisement -

Murder

 

పాట్నా: సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తుందని భార్యను భర్త హత్య చేసిన సంఘటన బీహార్ లోని భోజ్ పూర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పది సంవత్సరాల క్రితం అన్ను ఖాతూన్ ను అనిల్ వివాహం చేసుకున్నాడు. అన్ను వీడియోలు తీసి సామాజిక మాద్యమాల్లో పోస్టు చేస్తుండడంతో ఆమెపై భర్త పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశాడు. వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయవద్దని హెచ్చరించాడు. కానీ ఆమె భర్త చెప్పిన మాటను పెడచెవిన పెట్టింది. దీంతో వీడియోలు తీసి ఫేస్ బుక్ లో పెట్టడంతో ఆమె గొంతు నులిమి చంపేశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అనిల్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News