Monday, December 23, 2024

భార్యను రెండు ముక్కలు చేసి డ్రమ్ములో కుక్కాడు….

- Advertisement -
- Advertisement -

జూబ్లీహిల్స్‌లో దారుణం
భార్యను హత్య చేసి డ్రమ్ములో కుక్కేసిన భర్త

మన తెలంగాణ/పంజాగుట్ట్ట: జీవితాంతం తోడు, నీడగా ఉండాల్సిన భర్తే భార్యను అతి కిరాతకంగా హత్యచేసిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం మేరకు… జూబ్లీహిల్స్‌లోని రహమత్‌నగర్ సుభాష్‌నగర్‌లో అనిల్, సరోజ దంపతులు ఉంటున్నారు. వీరు ప్రేమించి మరీ పెళ్లిచేసుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా తరచూ వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పెద్దల సమక్షంలో రాజీకుదిర్చిన వీరిలో ఎటువంటి మార్పు రాలే దు. ఈ క్రమంలోనే శుక్రవారం కూడా ఇరువురు మధ్య గొడవ జరిగిం ది. గొడవ జరిగిన రోజు అనిల్ ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాడు. అయితే సరోజ తండ్రి ఆమెకు ఫోన్ చేస్తుండగా ఎటువంటి సమాధానం రాలేదు. అంతేకాకుండా అనిల్ కూడా ఫోన్ చేస్తే పొంతనలేని సమాధానం చెప్పటంతో అనుమానం వచ్చిన సరోజ తండ్రి వీరు ఉంటున్న ఇంటికి వచ్చి చూడగా తాళం వేసి ఉంది. దీంతో తాళం పగుటకొట్టి చూడటంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అప్పటికే సరోజ ఒక డ్రమ్ములో రెండు ముక్కలుగా పడి ఉంది. దీంతో కన్నీటిపర్యాంతమైన ఆయన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటన స్థలాలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News