మనతెలంగాణ/బాలాపూర్:రాచకొండ కమిషనరేట్ మీర్‌పేట్ పొలీస్‌స్టేషన్ పరిధిలో ఓ మాజీ సైనిక ఉద్యోగి అనుమానంతో తన భార్యను అతి కిరాతకంగా హత్యచేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందన్న కథనాలు వెలువడుతున్న క్రమంలో పొలీసులు మాత్రం సదరు గృహిణికి భర్తతో జరిగిన చిన్నగొడవ కారణంగా ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయిందన్న ఫిర్యాదుపై మిస్సింగ్ కేసు నమోద చేసి దర్యాప్తు చేస్తున్న ట్లు ప్రకటన విడుదల చేయడంతో సంఘటనకు సంబంధించిన వాస్తవాలపై గందరగోళ పరిస్ధితులు నెలకొన్నాయి. జిల్లెలగూడలోని న్యూవెంకటేశ్వరనగర్‌కాలనీలో భార్య వెంకటమాధవి (35)తోపాటు ఇద్దరు పిల్లలతో క లిసి నివాసం ఉండే ప్రకాశం జిల్లా జెపి చెరు వు ప్రాంతానికి చెందిన గురుమూర్తి గతంలో భారత సైన్యంలో పనిచేసి పదవీ విరమణ పొందడంతో ప్రస్తుతం కంచన్‌బాగ్‌లోని కేం ద్ర రక్షణ రంగ సంస్థ డిఆర్‌డిఓలో అవుట్‌సోర్సింగ్ సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్నా డు. ఈ నేపథ్యంలో భార్యపై తీవ్ర అనుమా నం పెంచుకున్న గురుమూర్తి ఆమెను అతి కిరాతకంగా హత్యచేయడంతో పాటు వెంకటమాధవి మృతదేహాన్ని ముక్కలు ముక్కలు గా నరికి ఇంట్లోని ప్రెషర్‌కుక్కర్‌లో ఉడికించి న అనంతరం స్థానిక సందచెరువులో పడవేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన దురాగతాన్ని గురుమూర్తి పోలీసుల ముందు అంగీకరించినట్లు
తెలిసింది.అయితే పోలీసులు ధ్రువీకరించడంలేదు. ఈనెల 13వ తేదీన వెంకటమాధవి కనిపించకుండా పోయినట్లు ఆమె తల్లిదండ్రులు మీర్‌పేట్ పొలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని,ఆ సమయంలో గురుమూర్తి సైతం తనకు ఏమి తెలియదు అన్నట్లుగా అత్త మామలతో కలిసి పొలీస్‌స్టేషన్‌కు వచ్చాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈనెల 16వ తేదీన మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో భర్త గురుమూర్తితో జరిగిన చిన్నగొడవ కారణంగా తమ కుమార్తె వెంకటమాధవి ఇంట్లో నుండి ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లి, కనిపించకుండా పోయిందని ఆమె తల్లిదండ్రులు ఉప్పాల సుబ్బమ్మ, వెంకటరమణలు తమకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈనెల 18వ తేదీన కేసు.నెం:81/2025 నమోదుచేసి దర్యాప్తు నిర్వహిస్తున్నామని,పూర్తివివరాలు ఇంకా తెలియాల్సి ఉందని బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. కాగా సంఘటనకు సంబంధించిన వాస్తవాలను పొలీసులు ఉద్దేశపూర్వకంగానే గొప్యంగా ఉంచుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.