Thursday, January 23, 2025

ప్రేమ పెళ్లి… భార్యను బకెట్‌లో ముంచి చంపి.. ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

May be an image of 2 people and text
హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అనుమానంతో భార్య తలను నీళ్ల బాకెట్‌లో ముంచి చంపి అనంతరం భర్త రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని పంజాగుట్టలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మహానంద బిశ్వాస్(24), సంపా సర్కార్(22) అస్సాంకు చెందిన దంపతులు హైదరాబాద్‌లోని పంజాగుట్టలో జాబ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి భార్యపై బిశ్వాస్ అనుమానం కలగడంతో ఇద్దరు మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం ఇద్దరు మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో భార్య తలను నీటి బకెట్‌లో భర్త ముంచడంతో ఊపిరాడక చనిపోయింది. వెంటనే అతడు ఇంటి నుంచి లక్డీకపూల్ వెళ్లి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని చూడగా ఇంటి అడ్రస్ ఉంది. వెంటనే ఇంటికెళ్లి చూడగా ఆమె మృతదేహం కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసి దంపతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని ఇన్‌స్పెక్టర్ నర్సింహరాజు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News