Monday, December 23, 2024

కోర్టులో భార్య గొంతు కోసిన భర్త

- Advertisement -
- Advertisement -

husband who cut his wife's throat with knife

బెంగళూరు: కర్నాటక రాష్ట్రం హాసన్ జిల్లాలోని న్యాయస్థానంలో భార్య గొంతు భర్త కోశాడు. నిందితుడిని వెంటనే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తట్టికెరెకె చెందిన శివకుమార్ (26), చైత్ర(24) ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. ఆరు సంవత్సరాల క్రితం ఈ జంట ప్రేమ పెళ్లి చేసుకుంది. ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయాలని న్యాయ స్థానంలో ఆర్జీ వేసుకున్నారు. శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ లో కేసు విచారణను మరో తేదీకి వాయిదా వేయడంతో ఇద్దరు బయటకు వెళ్లారు. కానీ అదే సమయంలో చైత్రను అతడు వెంబడించడంతో పారిపోవడానికి ప్రయత్నించింది. న్యాయ స్థానం ఆవరణంలోని మరుగుదొడ్ల సమీపంలో ఆమె గొంతు కోసి పారిపోయాడు. వెంటనే స్థానికులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News