కెపిహెచ్బి: కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. భార్యను తలపై కొట్టి, చున్నీతో ఉరిబిగించి చనిపోయిన తరువాత మూటగట్టి పెట్టి పరారైన ఘటన కేపీహెచ్బి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కేపీహెచ్బి పరిధిలోని ఎస్ఎస్ కాలనీలో రంగస్వామి అనే ఇంటి యజమాని ఇచ్చిన సమాచారంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెట్ల మందు విక్రయిస్తానని చెప్పిన వెంకటేశ్వర్లు అలియాస్ శేఖర్ గత కొద్ది రోజుల క్రితం తన భార్య స్రవంతి(౩5)తో కలిసి హైదర్‌నగర్ ఎస్ఎస్ కాలనీలోని రంగస్వామికి చెందిన సింగిల్‌బెడ్ రూం ఇంట్లో అద్దెకు దిగాడు. కాగా మంగళవారం ఫోన్ తాను ఇళ్ళు ఖాలీ చేసి వేరే చోటకు వెళుతున్నానని చెప్పి పరారయ్యాడు.
ఇంటిని శుభ్రం చేయడానికి వచ్చిన పనిమనిషికి ఇంటి మెట్ల కింద మూటలో శవం కనిపించడంతో ఇంటి యజమాని రంగస్వామికి సమాచారం ఇచ్చింది. దీంతో వెంటనే కేపీహెచ్బి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మూటవిప్పి పరిశీలించగా స్రవంతి తలపై బలమైన గాయాలు ఉండటంతో బ్లూ కలర్చున్నీతో ఉరివేసినట్లు మెడకు ఉంది. రెండు రోజుల క్రితమే హత్య చేయబడి ఉందని పోలీసులు నిర్ధారించుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇళ్ళు అద్దెకు దిగే సమయంలో భార్య స్రవంతికి సంబంధించి ఆదార్ కార్డు జిరాక్స్ తప్ప నిందితుడికి సంబంధించి వివరాలు ఇంటి యజమాని వద్ద లేవు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Husband Killed Wife in KPHB Colony