Thursday, January 23, 2025

భార్యను సుత్తితో కొట్టి చంపి… భర్త ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

Murder

అమరావతి: దంపతుల మధ్య గొడవ జరగడంతో కణికావేశంలో భార్యను భర్త సుత్తితో కొట్టి చంపి అనంతరం అతడు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గురువాయపాలెంలో తమ్మిశెట్టి వెంకట్రావు, పద్మ అనే దంపతులు నివసిస్తున్నారు. ఇద్దరు కూలీ పనులకు వెళ్లారు. స్థానిక మార్కెట్‌లోని రైల్వేట్రాక్ వద్దకు రాగానే ఇద్దరు మధ్య గొడవ జరగడంతో భార్యపై భర్త సుత్తితో దాడి చేశాడు. ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందడంతో కొంచెం దూరం వెళ్లిన తరువాత అతడు పురుగుల మందు తాగాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. రైల్వే ట్రాక్ పక్కన పద్మ మృతదేహం ఉండడంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News