Monday, December 23, 2024

తెనాలిలో భార్యను చంపి… మృతదేహానికి భర్త నివాళి..

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలిలో గురువారం దారుణ హత్య జరిగింది. స్థలం అమ్మి డబ్బులివ్వాలని భార్యతో గత కొంతకాలంగా గొడవ పడుతున్న భర్త దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలు బ్యూటీపార్లర్ నడుపుతున్న సమయంలో అక్కడికి వెళ్లిన కిరాతకుడు కత్తితో అత్యంత దారుణంగా పొడిచి హత్య చేశాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అనంతరం ముందే తెచ్చుకున్న పూలదండను భార్య మృతదేహాంపై వేసి నివాళి ఆర్పించాడు. అనంతరం తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News